News February 27, 2025

Way2News ఎఫెక్ట్: గండిపాలెం గురుకులానికి అధికారుల పరుగులు 

image

ఉదయగిరి(M) గండిపాలెం గురుకులంలో 23న విద్యార్థులతో <<15553238>>వంటపనులు<<>> చేయిస్తున్న అంశంపై Way2Newsలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు, జునైల్ కోర్టులో ఫిర్యాదు, AP కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరా, బాలల సంరక్షణ కమిషనర్ విచారణ చకచకా జరుగుతున్నాయి. బాలల హక్కుల కమిషనర్ ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక కోరింది. మరి విద్యార్థులకు న్యాయం దక్కేనా.?

Similar News

News February 27, 2025

నోరుంది కదా అని వాగితే పోసాని గతే: MLA సోమిరెడ్డి

image

నోరుంది కదా అని నీచంగా వాగేవాళ్లకు ఏ గతి పడుతుందో పోసాని ఉదంతమే నిదర్శమని MLA సోమిరెడ్డి తెలిపారు. పోసాని అరెస్టుపై స్పందిస్తూ.. ఈ ఘటనను తెలుగు ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్‌పై ఆయన వాడిన భాషకు 111 సెక్షన్ చాలదేమో అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఓ డైరెక్టర్‌ను మాత్రం అరెస్ట్ చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.

News February 26, 2025

శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: నెల్లూరు SP

image

నేడు(బుధవారం) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం అయ్యేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో భక్తులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP సూచించారు.

News February 26, 2025

నెల్లూరులో శివ‌రాత్రి శోభ‌.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

image

మహాశివ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని, నెల్లూరులోని శైవ‌క్షేత్రాలన్నీ విద్యుత్ కాంతుల‌తో ముస్తాబ‌య్యాయి. బుధ‌వారం శివ‌రాత్రి సంద‌ర్భంగా న‌గ‌రంలోని మూలాపేట, న‌వాబుపేట‌, గ‌ణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి త‌దిత‌ర శైవ క్షేత్రాల‌లో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల‌య అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

error: Content is protected !!