News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.
Similar News
News January 14, 2026
విజయ్ ఫ్యాన్స్‌పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

ఓ వర్గం ఫ్యాన్స్ కావాలనే తమ సినిమాపై విమర్శలు చేస్తున్నారని పరాశక్తి టీమ్ ఆరోపిస్తోంది. ఫేక్ IDల ద్వారా కొంత మంది బురద జల్లుతున్నారని తాజాగా డైరెక్టర్ సుధా కొంగర అన్నారు. తమపై విమర్శలు చేస్తున్నది రాజకీయ వర్గాలు కాదన్నారు. పండుగకు విడుదలకు నోచుకోని మరో సినిమా హీరో ఫ్యాన్సే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఆమె విజయ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది.
News January 14, 2026
క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
News January 14, 2026
బ్లాక్‌చైన్ భద్రతలో భూ రిజిస్ట్రేషన్లు

TG: భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రతను కల్పించనుంది. తొలుత ఫ్యూచర్ సిటీ భూముల కోసం ప్రత్యేక ‘హైడ్రా-లెడ్జర్’ వ్యవస్థను డిజైన్ చేసింది. దీంతో ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. డబుల్ రిజిస్ట్రేషన్లు వంటివి లేకుండా కొనే వారికి, అమ్మేవారికి పూర్తి భరోసా ఇచ్చేలా ఈ ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ‘వే2న్యూస్’కు వివరించారు.


