News February 27, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 6, 2025
గ్రాముకు రూ.9వేల లాభం

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్‌లైన్‌లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.
News November 6, 2025
సిరిసిల్ల: ‘రెండు రోజుల్లోగా సమర్పించాలి’

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టుల నియామకానికి సంబంధించిన లిస్టును అధికారిక వెబ్‌సైట్ https://rajannasiricilla.telangana.gov.in ప్రచురించామని జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కలెక్టరేట్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు.
News November 6, 2025
SRD: జాతీయ సాహస శిబిరానికి ‘తార’ విద్యార్థిని

కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా, శ్రీవిద్య అందులో ఒకరు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.


