News February 27, 2025
సూర్యాపేట: వచ్చే ఏడాది ట్యాబ్‌ల ద్వారా టీచింగ్

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే సెలెక్ట్ చేసిన పాఠశాలలకు కంప్యూటర్ల సరఫరా ప్రారంభించగా త్వరలో ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లను అందించనున్నారు. ఈ లెక్కన ఎంపికైన 22 స్కూళ్లకు 550 ట్యాబ్‌లను సరఫరా చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటి ద్వారా బోధించనున్నారు.
Similar News
News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో 85.60% పోలింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 85.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది టీచర్లకు గాను 1,997 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
News February 27, 2025
తూ.గో: జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

తూర్పుగోదావరి జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో చర్లపల్లి – (07031) కాకినాడ టౌన్‌కు, మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో కాకినాడ టౌన్ – చర్లపల్లి ( 07032) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. జిల్లాలో రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లో ఆగుతాయని అధికారులు వివరించారు.
News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 85 శాతం పోలింగ్: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం ముగిసే సరికి 85 శాతం పోలింగ్ పూర్తయినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 357 పురుషుల ఓటర్లలో 273 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 257 మహిళా ఓటర్లలో 202 మంది తమ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించుకున్నట్లు ఆమె వెల్లడించారు.