News February 27, 2025
KNR: ఓటు వేసిన బీఎస్పీ అభ్యర్థి

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయన సతీమణి ప్రసన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోయినపల్లి పోలింగ్ కేంద్రంలో వారిరువురు ఓటు వేశారు. ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 27, 2025
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

కరీంనగర్ ముకరంపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News February 27, 2025
కరీంనగర్: ఓటు వేయడానికి ఆమె డల్లాస్ నుంచి వచ్చింది

శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం కరీంనగర్లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు దూర్షెడ్ గ్రామానికి చెందిన శ్రీరామోజు అఖిల డల్లాస్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఆమె తెలిపారు.
News February 27, 2025
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ 34.61% శాతం, ఉపాధ్యాయుల ఓటింగ్ 58.35% నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.