News February 27, 2025

భువనగిరి: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

image

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో తమకు చిల్లర బాధలు తప్పుతాయని యాదగిరిగుట్ట బస్ స్టేషన్ నుంచి ప్రయాణించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 18, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా బాధ్యతలు.. CM రేవంత్‌ను కలిసిన NVS రెడ్డి
* SEP 21న చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడనున్న కల్వకుంట్ల కవిత
* HYDలో భారీ వర్షం.. GHMC, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్న మంత్రి పొన్నం
* మూసీకి వరద.. అంబర్‌పేట్-మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
* SEP 21-30 వరకు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలి: మంత్రి జూపల్లి

News September 18, 2025

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 18, 2025

వేలూరు సీఎంసీలో ఎన్టీఆర్ వైద్య సేవ లేనట్లేనా..?

image

చిత్తూరు జిల్లా నిరుపేదలు చాలామంది వేలూరు CMC ఆసుపత్రికి వెళ్తుంటారు. క్రిటికల్ కేర్, యాక్సిడెంట్స్, ఇతర ఏ సమస్యలు వచ్చిన ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఈ ఆసుపత్రే. ఇది తమిళనాడులో ఉండటంతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు కావడం లేదు. రూ.లక్షల్లో బిల్లులతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది.