News February 27, 2025
తగ్గిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.87,380కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,000గా ఉంది.
Similar News
News February 27, 2025
కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
News February 27, 2025
CT: గెలుపు రుచి ఎరుగని పాకిస్థాన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం కూడా లేకుండా తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ఘోర ఓటమిపాలై, బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. పాక్ తలరాతను చూసి ఆ దేశ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కప్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదంటూ వాపోతున్నారు.
News February 27, 2025
ఆర్టీసీలో ఏమైనా పొగొట్టుకున్నారా ? ఈ నంబర్‌కు కాల్ చేయండి

TG: ఆర్టీసీ టికెట్‌పై రాసిన చిల్లర తీసుకోకుండా మర్చిపోయారా? ఏం ఫర్వాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 040-69440000 కాల్ చేసి మీరు ప్రయాణించిన బస్సు, టికెట్ వివరాలు చెబితే ఆ డబ్బులను RTC మీకు ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సైనా అదే టికెట్‌పై మరో బస్సులో గమ్యానికి చేరవచ్చు. ఏవైనా వస్తువులు పొగొట్టుకున్నాటోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వాటిని పొందొచ్చు.