News February 27, 2025
మహాకుంభమేళా ముగిసినా కొనసాగుతున్న రద్దీ

మహాకుంభమేళా ముగిసినా ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లారు. దీంతో సంగమం ప్రాంతంలోని పలు సెక్టార్లలో భక్తులు కనిపిస్తున్నారు. నిన్నటితో కుంభమేళా ముగియగా, 45 రోజుల్లో 66.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News February 27, 2025
PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.
News February 27, 2025
పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 27, 2025
ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎల్లుండి(మార్చి 1) ఓటీటీలోకి రానుంది. సా.6గంటల నుంచి అటు జీతెలుగులో ప్రసారం కానుండగా ఇటు జీ5 యాప్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.