News February 27, 2025
ఉద్యోగులకు EPFO వడ్డీరేటు తగ్గింపు షాక్?

FY25కి గాను EPFO వడ్డీరేటును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. FRI జరిగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగులో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం 8.25% ఉన్న వడ్డీరేటును 8కి తగ్గిస్తారని అంచనా. స్టాక్‌మార్కెట్లు డౌన్‌ట్రెండులో ఉండటం, బాండ్‌యీల్డులు తగ్గడం మరోవైపు సెటిల్మెంట్లు పెరగడమే ఇందుకు కారణాలు. ట్రస్టీస్ నిర్ణయం 30 కోట్ల చందాదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనుంది.
Similar News
News February 27, 2025
పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 27, 2025
ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎల్లుండి(మార్చి 1) ఓటీటీలోకి రానుంది. సా.6గంటల నుంచి అటు జీతెలుగులో ప్రసారం కానుండగా ఇటు జీ5 యాప్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
News February 27, 2025
షాకింగ్.. కొడుకుకు 18 ఏళ్లు నిండొద్దని చంపేసింది

USలో మిచిగాన్‌లో దారుణ ఘటన జరిగింది. కేటీ లీ అనే మహిళ కొడుకు ఆస్టిన్(17)ను బర్త్ డే రోజునే చంపేసింది. తనకు 18 ఏళ్లు నిండొద్దని ఆస్టిన్ కోరుకున్నాడని, ఆ మేరకు తల్లి చంపేసిందని కోర్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. అయితే తామిద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక గొంతు కోసినట్లు ఆమె తొలుత 911కు కాల్ చేసి చెప్పడం గమనార్హం. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం.