News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పట్టభద్రులు 22,397 మంది (5.2 శాతం), ఉపాధ్యాయులు 950 మంది (11.52 )శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News February 27, 2025
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించనున్న మోదీ సర్కార్?

కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను తగ్గించాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. వాటా పంపకాలపై సలహాలిచ్చే ఫైనాన్స్ కమిషన్‌కు ఇప్పటికే విషయం చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం 41గా ఉన్న వాటాను కనీసం 40%కి తగ్గించాలని సూచించినట్టు తెలిసింది. అరవింద్ పణగడియా నాయకత్వంలోని కమిషన్ FY2026-27 రికమెండేషన్స్ రిపోర్టును OCT 31లోపు కేంద్రానికి ఇస్తుంది. ఒక శాతం తగ్గినా కేంద్రానికి రూ.35K CR మిగులుతాయి.
News February 27, 2025
మరికల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మరికల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పసుపులకి చెందిన కృష్ణయ్యను గూరకొండ దగ్గర బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 27, 2025
జిల్లాలో 96.54 శాతం పోలింగ్ నమోదు

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 984 ఓటర్లుండగా, మొత్తం 96.54 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.