News February 27, 2025

సిద్దిపేట జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే..?

image

సిద్దిపేట జిల్లాలో MLC ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 10 వరకు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఓటింగ్ 8.2% గా నమోదు కాగా ఉపాధ్యాయ ఓటింగ్ 8.8 శాతంగా నమోదైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఓటింగ్ 8.5 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News September 19, 2025

బ్రెజిల్‌లో మహిళా వర్సిటీ అధ్యాపకురాలికి పతకం

image

బ్రెజిల్‌లో ఈ నెల 16వ తేదీ జరిగిన బ్రిక్స్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంపిటేషన్‌లో మహిళా వర్సిటీ అధ్యాపకురాలు రమాజ్యోతి కాంస్య పతకం పొందారు. ‘బయోడిగ్రేడబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ ఉత్పత్తులు’ ఇన్నోవేషన్‌ను ఆమె వర్చువల్ విధానంలో ప్రదర్శించారు. ఈ ఆవిష్కరణకు కాంస్య పతకం లభించింది. VC ఉమ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతికి అనుగుణమైన పరిష్కారాలను తీసుకువచ్చే గొప్ప గుర్తింపు అని కొనియాడారు.

News September 19, 2025

కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

image

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.

News September 19, 2025

వైసీపీ కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించింది: పుల్లారావు

image

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి పథకానికి తన బొమ్మ వేసుకోవాలనుకున్నారని, అందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయిందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశంలో అమలు కాని పథకాలన్నీ అమలవుతాయన్నారు. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించిందని ఆయన విమర్శించారు. చిలకలూరిపేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.