News February 27, 2025
సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్ అమలు

మార్చి 1 నుంచి 31వరకు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 16, 2026
పాపవినాశనం రోడ్డుపై భారీగా వాహనాలు

తిరుమలలో పార్వేట ఉత్సవం ఇవాళ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాపవినాశనం తీర్థానికి వెళ్లేందుకు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అనుమతించ లేదు. గోగర్భం సమీపంలోని గేటు వద్ద సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. ఆక్టోపస్ భవనం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉత్సవాల కారణంగా వాహనాల అనుమతి కుదరదని విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలియజేశారు. పాపనాశనం, ఆకాశంగంగకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు..
News January 16, 2026
నిర్మల్: సదర్మాట్ సాకారం.. తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర

నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సదర్మాట్ బ్యారేజీ నేడు సాకారం కానుంది. 2017లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తికాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ బ్యారేజీని మధ్యాహ్నం సీఎం అంకితం చేయనున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
News January 16, 2026
OTTలో కొత్త సినిమాలు.. చూసేయండి!

సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు OTTలోకి వచ్చాయి. శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా ‘120 బహదూర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జగపతిబాబు, సుహాసిని తదితరులు నటించిన ‘అనంత’ మూవీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ZEE5లో గుర్రం పాపిరెడ్డి, సోనీలివ్లో మమ్ముట్టి ‘కలాంకావల్’ అందుబాటులో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో వారం కిందట బాలయ్య ‘అఖండ-2’ విడుదలైంది.


