News February 27, 2025

IIT కాలేజీ స్క్రీన్‌పై పోర్న్: పిట్రోడాకు స్ట్రాంగ్ కౌంటర్

image

IIT రాంచీ వెబ్‌కాస్టులో మాట్లాడుతుండగా సిస్టమ్‌ను ఎవరో హ్యాక్ చేసి పోర్న్ ప్లే చేశారన్న శామ్ పిట్రోడా ఆరోపణలను EDU మినిస్ట్రీ ఖండించింది. ‘అసలు రాంచీలో IITనే లేదు. అక్కడుంది IIIT. పిట్రోడాను ఫిజికల్‌/డిజిటల్‌గా లెక్చరివ్వడానికి పిలవలేదని వారూ స్పష్టం చేశారు. దీన్ని బట్టి IITలను అపఖ్యాతి పాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. మేం దీనిని సహించం. లీగల్ యాక్షన్ తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.

Similar News

News February 27, 2025

EAPCET ప్రవేశాల్లో సవరణలు

image

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <>సవరణలు <<>>చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించనుంది. 15% అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లకు 4 రకాలుగా అర్హులను గుర్తించింది. తెలంగాణ స్థానికులు, TGలో పదేళ్లు చదివిన ఇతర రాష్ట్రాల వారు, కేంద్ర-రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, కేంద్ర-రాష్ట్ర ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ 15% సీట్లకూ అర్హులని పేర్కొంది.

News February 27, 2025

నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. AP, TGలకు KRMB సూచన

image

తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలంది. 15 రోజులకోసారి ఇరు రాష్ట్రాల అధికారులు పరిస్థితులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని ఏపీ, 63TMCలు ఇవ్వాలని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే.

News February 27, 2025

$: సెంచరీ దిశగా..!

image

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. పది సంవత్సరాల్లో రూపాయి విలువ ఎంతలా పడిపోయిందో ఓ నెటిజన్ వివరించారు. 2015లో ఒక్క డాలర్‌కు రూ.65.87 కాగా ఇది 2020లో రూ.73.78కి చేరింది. 2024లో రూ.84.79 ఉండగా ఈరోజు డాలర్ విలువ రూ.87.17గా ఉంది. రోజురోజుకీ పెరుగుతూ పోతుండటంతో ఇది త్వరలోనే రూ.100కు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!