News February 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 60.65 శాతం పోలింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 60.65 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 1415 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారు.
Similar News
News February 27, 2025
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేరును ఆయన బయటకు చెప్పారని వాసిరెడ్డి పద్మ 2024 నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై 72, 79 BNS కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
News February 27, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 93% పోలింగ్ నమోదు

ఖమ్మం జిల్లాలో MLC ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4089 ఓటర్లు ఉండగా 3805 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
News February 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు మహిళలు 8160, పురుషులు 13098 మొత్తం 21259 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68.50% పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీలో మహిళలు 438, పురుషులు 611 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94.42% పోలింగ్ నమోదయింది.