News February 27, 2025

పెద్దపల్లి జిల్లాలోని పోలింగ్ అప్డేట్

image

పెద్దపల్లి జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 20.88% నమోదయింది. మహిళలు 2501, పురుషులు 3982, మొత్తం 6483 మంది ఓటు వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 47.25% నమోదైంది. మహిళలు 212, పురుషులు313, మొత్తం 525 మంది ఓటు వేశారు.

Similar News

News November 3, 2025

హెల్మెట్ ధరిస్తేనే అల్లూరి జిల్లాలోకి అనుమతి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. టూ వీలర్స్ వినియోగదారులు హెల్మెట్ ధరిస్తేనే జిల్లాలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రతి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేసి హెల్మెట్ లేని వారిని, మద్యం సేవించి వాహనం నడుపుతున్న అనుమతించరాదని పోలీసులను ఆదేశించారు.

News November 3, 2025

పోలీస్ గ్రీవెన్స్‌లో 45 ఫిర్యాదులు

image

పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 45 మంది అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని, తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

News November 3, 2025

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ సభ్యులతో చర్చించారు. వైద్య పరీక్షల కోసం ART సెంటర్లకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉన్న లేబరేటరీలు, చికిత్స, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇతర సౌకర్యాలపై అరా తీశారు.