News February 27, 2025

నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Similar News

News February 27, 2025

గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిశంకర కాలేజీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2025

అప్పుడు స్పందించకుండా ఇప్పుడు రాజకీయామా?: ఉత్తమ్

image

TG: SLBC ప్రమాదంపై BRS నేతల విమర్శలపై మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోతే, కాళేశ్వరం కూలి ఆరుగురు, పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదంలో ఆరుగురు చనిపోయినా వెళ్లలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే KCR కదల్లేదు. మాజీ సీఎం ఫామ్‌హౌస్ దగ్గర్లోని మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే స్పందించకుండా ఇప్పుడు రాజకీయమా?’ అని ధ్వజమెత్తారు.

News February 27, 2025

విశాఖలో 300 ప్రత్యేక బస్సు సర్వీసులు

image

విశాఖలో శివరాత్రి మహా పర్వదినం పురస్కరించుకొని 300 ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతో నడిపామని జిల్లా ప్రజారవాణాధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఈ సర్వీసులు నడిపామని వెల్లడించారు. నగర నలుమూలల నుంచి వివిధ బీచ్‌లు, శైవక్షేత్రాలకు ఈ బస్సులు ఏర్పాటు చేశారు. జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. 

error: Content is protected !!