News February 27, 2025

చిట్టీల పేరుతో చీటింగ్.. రూ.100కోట్లతో జంప్!

image

HYDలో ఓ చిట్టీల వ్యాపారి సుమారు 2వేల మందికి డబ్బులు చెల్లించకుండా ఫ్యామిలీతో పరారయ్యాడు. అనంతపురం జిల్లాకి చెందిన పుల్లయ్య 18yrs క్రితం HYD వచ్చాడు. కూలీ పనులు చేసే అతను చిట్టీల వ్యాపారంతో కోటీశ్వరుడయ్యాడు. బీకేగూడ రవీంద్రానగర్‌లో ఉంటూ స్థానికులతో చిట్టీలు వేయించాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని అడగడంతో ఈనెల 21న పరారయ్యాడు. బాధితులంతా అతని ఇంటికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.

Similar News

News November 8, 2025

నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

image

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం

News November 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 8, 2025

JIO: ఉచితంగా జెమినీ ఏఐ ప్రో ప్లాన్!

image

ఇప్పటివరకు 18-25 ఏళ్ల మధ్య వారికే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను ఇప్పుడు 25ఏళ్లు పైబడిన వారికీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. My Jio యాప్‌లో దీన్ని క్లైమ్ చేసుకోవచ్చు. ఇందుకు 5G ప్లాన్ యాక్టివేటై ఉండాలి. దీని ద్వారా రూ.35,100 విలువైన జెమినీ ప్లాన్ 18నెలల పాటు ఫ్రీగా పొందొచ్చు. ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి.