News February 27, 2025
కామారెడ్డి: ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి: SP

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని KMR జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి పట్టణంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. 312 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. గువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. శనివారం ఉదయం 19.6 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
News July 5, 2025
WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్‌ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.
News July 5, 2025
పవన్ రాకతో.. జిల్లా జనసేన ఆల్ సెట్.!

ప్రకాశం జిల్లాలో జనసేన సెట్ అయినట్లేనన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో జనసేన బలోపేతంపై క్యాడర్ దృష్టిసారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని మార్కాపురం పర్యటన సందర్భంగా వన్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనితో జిల్లాలో క్యాడర్ ఒకే తాటిపైకి వచ్చి పార్టీపై దృష్టి సారించే పరిస్థితి ఉందట. చివరికి పవన్.. జిల్లాలో ఆల్ సెట్ చేసినట్లేనని టాక్ వినిపిస్తోంది.