News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 71.20 శాతం పోలింగ్ నమోదు

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 12.00 గంటల వరకు 71.20 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. దేవరాపల్లిలో 63.49 శాతం, చీడికాడలో 71.74 శాతం, మాడుగులలో60 శాతం, గొలుగొండలో 62.20, రోలుగుంటలో 64.58, రావికమతంలో 57.69, బుచ్చయ్యపేటలో 73.53 శాతం నమోదయింది. అలాగే చోడవరంలో 66.67, కె.కోటపాడులో 75.70, నర్సీపట్నంలో 75.98, నాతవరంలో 80.28, కోటవురట్లలో72.84, మాకవరపాలెంలో 71.70 శాతం నమోదయింది.
Similar News
News July 5, 2025
మామడ మండలంలో అత్యధిక వర్షపాతం

గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మామడలో 6.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా దిలావర్పూర్ 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. కుబీర్‌లో 1.2, తానూర్ 2.2, ముధోల్ 1.2, లోకేశ్వరం 5.2, నిర్మల్ 1.8, నిర్మల్ రూరల్ 3.6, సోన్ 2.2, లక్ష్మణ్ చందా 1.8,, దస్తురాబాద్‌లో 1.2మి. మీగా రికార్డు అయింది.
News July 5, 2025
HYD: భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణపేట జిల్లా కోటకొండ వాసి అంజిలప్ప(32)కు రాధతో పదేళ్ల క్రితం పెళ్లైంది. దంపతులు బాచుపల్లిలో ఉంటూ కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న గొంతు నులిమి హత్య చేసింది. కుటుంబీల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.
News July 5, 2025
‘బంగారు కుటుంబాలకు సాయమందించాలి’

పార్వతీపురం జిల్లాలో అవకాశాలు అందిపుచ్చుకోని పేదల కోసం బంగారు కుటుంబం దోహదపడుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పార్వతీపురం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలో బంగారు కుటుంబాలను గుర్తించి మార్గదర్శకులచే సాయమందించేలా లక్ష్యం పెట్టుకోవాలని ఆదేశించారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ లక్ష్య సాధనకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.