News February 27, 2025
రేపే AP బడ్జెట్.. కీలక పథకాలకు కేటాయింపులు

AP: అసెంబ్లీలో రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి.
Similar News
News January 4, 2026
నా అన్వేష్ కేసులో కొత్త సెక్షన్లు

TG: నటి, BJP నేత కరాటే కళ్యాణి ఫిర్యాదుతో యూట్యూబర్ <<18721474>>నా అన్వేష్<<>>పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ FIRలో మరిన్ని సెక్షన్స్ జోడించాలని ఆమె పోలీసులను కోరారు. ‘అన్వేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అతడో దేశద్రోహి. మొన్నటి FIRలో IT సెక్షన్ 69(A) కూడా చేర్చాలని రిప్రజెంటేషన్ ఇచ్చాం. అతడి యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలని, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలని కోరాం’ అని తెలిపారు.
News January 4, 2026
APలో ఆ ప్రాజెక్టుని ఆపేందుకు తెలంగాణ ప్రయత్నాలు

TG: గోదావరి నదిపై AP చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌ను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ రేపు విచారణకు వస్తోంది. ఈ నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని, ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపేలా చూడాలని సూచించారు.
News January 4, 2026
విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్‌కు అడ్డంకులు!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ మూవీ జనవరి 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించినా ఇప్పటివరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని తెలుస్తోంది. “సెన్సార్ బోర్డు కొన్ని రోజుల క్రితం U/A సర్టిఫికెట్‌ను సిఫార్సు చేసింది. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు” అని TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ CTR నిర్మల్ కుమార్ అన్నారు. సినిమాను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు.


