News February 27, 2025
మెదక్: ఓటేయాలనే సంకల్పం.. వాకర్తో పోలింగ్ కేంద్రానికి

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనకు తెలిసిందే. గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక సందర్బంగా మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒకరు వచ్చారు. ఆయన తీవ్ర మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా.. వాకర్ సాయంతో క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. దీంతో అయన సంకల్పానికి శభాష్ అంటున్నారు.
Similar News
News April 22, 2025
మెదక్: రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా, మండల స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తులు ఈనెల 24 వరకు స్వీకరిస్తున్నట్లు మెదక్ డీఈఓ రాధా కిషన్ తెలిపారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ వారి ఆదేశానుసారం 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి 28న ప్రకటిస్తారన్నారు.
News April 21, 2025
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి: మంత్రి

వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్ను మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.
News April 21, 2025
మెదక్: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో తెలపాలని ఎస్పీ సూచించారు.