News February 27, 2025
అర్ధరాత్రి OTTలోకి సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్

పుష్కర్-గాయత్రి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సుడల్: ది వర్టెక్స్’ వెబ్ సిరీస్ సీక్వెల్ ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఐశ్వర్యా రాజేశ్, కథిర్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. IMDb రేటింగ్ 8.1 సాధించడంతో పాటు 30 భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది.
Similar News
News January 9, 2026
కాశీ సెట్‌లో హైఓల్టేజ్ యాక్షన్

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను పూర్తి చేసిన మేకర్స్, ప్రస్తుతం హైఓల్టేజ్ యాక్షన్‌పై ఫోకస్ పెట్టారు.
News January 9, 2026
హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్‌లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.
News January 9, 2026
జనవరి 09: చరిత్రలో ఈరోజు

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం


