News February 27, 2025

తూ.గో: జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

తూర్పుగోదావరి జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో చర్లపల్లి – (07031) కాకినాడ టౌన్‌కు, మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో కాకినాడ టౌన్ – చర్లపల్లి ( 07032) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. జిల్లాలో రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని అధికారులు వివరించారు. 

Similar News

News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి వాసి మృతి 

image

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కొర్రపాటి నాగ మురళి శివప్రసాద్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన నివాస ప్రాంతo అన్నపూర్ణమ్మ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్‌గా ఉన్న శివప్రసాద్ గత వారం కుంభమేళాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీహార్‌లోని గయలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు రాజమండ్రికి ఆయన భౌతికకాయం రానుంది.

News February 27, 2025

రాజమండ్రి: నదీజలాలను సంరక్షించండి- కమిషనర్ 

image

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నదీ జలాలను సంరక్షించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు డ్రాయింగ్ పోటీలు, బోట్ రేస్, మ్యూరల్ పెయింటింగ్, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారిగా ఇంజినీర్ షేక్ మదర్షా అలీని కమిషనర్ నియమించారు.

News February 26, 2025

నల్లజర్ల: రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు

image

ఏపీలో రేపు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో 2019 మార్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో 11 మంది బరిలో దిగగా, ఈసారి 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. గోపాలపురం పరిధిలో ఓటర్లు 6443, గోపాలపురం 1777, దేవరపల్లి 2166, నల్లజర్ల 2500గా ఓటర్లు ఉన్నారు.

error: Content is protected !!