News February 27, 2025
చంటి బిడ్డలతో ఓటేసిన మహిళా గ్రాడ్యుయేట్స్

రాజవొమ్మంగి ఎంపీపీ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన MLC పోలింగ్ బూత్‌కు పలువురు మహిళా గ్రాడ్యుయేట్స్ చంటిబిడ్డలతో వచ్చారు. పిల్లలు తల్లిని విడిచి వేరొకరి వద్దకు వెళ్లకపోవడంతో చేసేది లేక పిల్లలతో పాటే వెళ్లి ఓటు వేశారు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకొంది. కాగా ఈ బూత్‌లో మొత్తం ఓటర్లు 670 కాగా సాయంకాలం 3-15 నిముషాలకు 430 మంది ( 66%) ఓటు వేశారు.
Similar News
News September 17, 2025
హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్ పోలోతో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.
News September 17, 2025
జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.
News September 17, 2025
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. పాక్ ఆడుతుందా?

ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. షేక్‌హ్యాండ్ వివాదంలో <<17723523>>పాక్ డిమాండ్<<>>ను ICC తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే UAEతో మ్యాచ్‌లో దాయాది దేశం ఆడుతుందా? టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకోగానే తప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో సందిగ్ధత కొనసాగుతోంది.