News February 27, 2025

ఆర్టీసీలో ఏమైనా పొగొట్టుకున్నారా ? ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: ఆర్టీసీ టికెట్‌పై రాసిన చిల్లర తీసుకోకుండా మర్చిపోయారా? ఏం ఫర్వాలేదు. టోల్ ఫ్రీ నంబర్ 040-69440000 కాల్ చేసి మీరు ప్రయాణించిన బస్సు, టికెట్ వివరాలు చెబితే ఆ డబ్బులను RTC మీకు ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో బస్సు మిస్సైనా అదే టికెట్‌పై మరో బస్సులో గమ్యానికి చేరవచ్చు. ఏవైనా వస్తువులు పొగొట్టుకున్నాటోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి వాటిని పొందొచ్చు.

Similar News

News February 28, 2025

TODAY TOP STORIES

image

* ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు
* ఉద్యోగాల కల్పనలో నం.1గా నిలిచాం: CM రేవంత్
* ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ
* బీఆర్ఎస్ వల్లే SLBC ప్రమాదం: ఉత్తమ్
* గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
* తగ్గిన బంగారం ధరలు
* తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
* ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’
* పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

News February 28, 2025

చిన్నారిని చిదిమేసిన మానవమృగం.. ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు

image

ఓ మానవమృగం కామవాంఛకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు వేశామని డాక్టర్లు చెప్పడం ఆ 17 ఏళ్ల నిందితుడి రాక్షసత్వానికి నిదర్శనం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. నిందితుడు పీకలదాకా తాగి బాలిక తలను గోడకు పలుమార్లు కొట్టాడని, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, జువైనల్‌కు తరలిస్తామని చెప్పారు.

News February 28, 2025

BREAKING: ఆర్సీబీ ఘోర పరాజయం

image

WPLలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్‌నర్ (58) ఫిఫ్టీతో రాణించారు. లిచిఫీల్డ్ (30) ఫర్వాలేదనిపించారు. రేణుకా సింగ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు.

error: Content is protected !!