News February 27, 2025
సత్యవర్ధన్‌కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.
Similar News
News November 3, 2025
జుట్టు రాలడాన్ని నివారించే తమలపాకులు

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందర్నీ హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి ఈ తమలపాకులు ఉపయోగపడతాయి. * తమలపాకులని కడిగి పేస్టుచేసి అందులో కాస్త నెయ్యి కలపాలి. దీన్ని మాడునుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. * తమలపాకు పేస్ట్‌లో కాస్త కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేస్తే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
News November 3, 2025
WWC-2025 ‘లీడింగ్’ రికార్డులు

☞ అత్యధిక వికెట్లు-22(దీప్తి శర్మ-భారత్)
☞ సిక్సర్లు- 12(రిచా ఘోష్-భారత్)
☞ పరుగులు- 571(లారా-దక్షిణాఫ్రికా)
☞ వ్యక్తిగత స్కోరు- 169(లారా)
☞ సెంచరీలు-2(లారా, గార్డ్‌నర్, హేలీ)
☞ అర్ధసెంచరీలు-3(లారా, దీప్తి శర్మ)
☞ అత్యధిక ఫోర్లు-73(లారా)
☞ ఈ టోర్నీలో భారత్ తరఫున మంధాన, ప్రతీకా, రోడ్రిగ్స్ సెంచరీలు చేశారు.
News November 3, 2025
రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.


