News February 27, 2025

పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 17, 2025

మహారాష్ట్ర క్లబ్‌లో తెలంగాణ జూదరులు

image

మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ జూదానికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పేకాట నిర్వహణపై ఉక్కుపాదం మోపడంతో వీరంతా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాకు ఆనుకోని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఇండోర్‌ క్లబ్‌ల పేరిట అనుమతులు తీసుకుంటూ నిర్వాహకులు పేకాట నిర్వహిస్తూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు. అక్కడ ఆడే వాళ్లంతా MNCL, ASF జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం.

News September 17, 2025

ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

image

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.

News September 17, 2025

కాసేపట్లో యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు

image

ఆసియా కప్‌లో భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని చెప్పింది. ఈక్రమంలోనే రా.8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఆటగాళ్లు హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.