News February 27, 2025
మరికల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మరికల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పసుపులకి చెందిన కృష్ణయ్యను గూరకొండ దగ్గర బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 28, 2025
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఏటా ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దినోత్సవం నాడు అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తులను గుర్తించి అవార్డులు ఇవ్వడం, సంక్షేమ శిబిరాలు నిర్వహించడం వంటివి చేయనుంది.
News February 28, 2025
SEBI చీఫ్‌గా తుహిన్ కాంత పాండే

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) చీఫ్‌గా తుహిన్ కాంత పాండేను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. తుహిన్ సెబీ ఛైర్మన్‌గా మూడేళ్లు పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మాధవి పురీ బుచ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా ఇటీవల ఆమె తీవ్ర ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.