News February 27, 2025
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News February 28, 2025
సేవలను మరింత మెరుగుపరచాలి: విశాఖ జేసీ

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాలులో వారితో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్, రేషన్ బియ్యం పంపిణీ, తూనికలు, కొలతలు ఇతర ప్రమాణాలు పాటించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు.
News February 28, 2025
వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
News February 28, 2025
జిల్లాలో రాయపర్తిలోనే తక్కువ పోలింగ్

రాయపర్తి మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వరంగల్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రాయపర్తి మండలంలో 66మంది ఓటర్లుండగా.. 60 మంది టీచర్లు ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 90.90శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కువగా సంగెం మండలంలో 98.48శాతం నమోదైంది.