News February 27, 2025

9 నెలల్లోనే కూటమి మోసం ప్రజలకు అర్థమైంది: చెల్లుబోయిన

image

AP: ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక విస్మరించారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 9 నెలల పాలనలోనే ప్రభుత్వం చేసిన మోసం ప్రజలకు అర్థమైందన్నారు. కక్ష సాధింపులకే సమయం వెచ్చిస్తూ పాలన గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర అప్పులు, తిరుమల లడ్డూ అంశంలో అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. నిత్యావసరాల ధరలను భారీగా పెంచేశారని ఆరోపించారు.

Similar News

News November 7, 2025

రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.

News November 7, 2025

BJP, BRS కుమ్మక్కు: మంత్రి పొన్నం

image

TG: జూబ్లీహిల్స్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్లు సాధించిన బీజేపీకి.. 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘2023లో BRSకు 80 వేల ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లే ఎందుకు వచ్చాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి BRS మద్దతు ఇస్తే శాసనసభ ఎన్నికల్లో BRSకు BJP మద్దతు ఇచ్చింది’ అని ఆరోపించారు.

News November 7, 2025

వీధి కుక్కలు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: సుప్రీంకోర్టు

image

వీధికుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ‘స్కూల్స్, రైల్వే స్టేషన్స్, ఆస్పత్రుల్లోకి వీధికుక్కలు రాకుండా 8 వారాల్లో ఫెన్సింగ్ వేయాలి. NH, ఎక్స్‌ప్రెస్ హైవేలపైకి మూగజీవాలు రాకుండా చూడాలి. పబ్లిక్ ఏరియాల్లో స్ట్రే డాగ్స్ తిరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించింది. అమికస్ క్యూరీ దీనిపై నివేదిక అందించాలంది. అమలుపై అఫిడవిట్లు వేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.