News February 27, 2025

గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిశంకర కాలేజీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

మేడారం భక్తుల కానుకలు.. భద్రమేనా..!?

image

మేడారం జాతరలో హుండీలో భక్తుల కానుకలకు ఈసారైనా దేవదాయ శాఖ అధికారులు భద్రత కల్పిస్తారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత మేడారం జాతరలో అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి జాతరలో ఏర్పాటు చేసిన హుండీలకు వర్షపు నీరు చేరి భక్తులు వేసిన బియ్యం, నోట్ల కాగితాలు, ఇతర కానుకలు తడిసి ముద్దయ్యాయి. లక్షల రూపాయలు బూజు పట్టి పనికిరాకుండా పోయాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.

News January 9, 2026

యాదాద్రి: మదర్ డైరీ ఛైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి

image

నల్గొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల మదర్ డైరీ ఛైర్మన్‌గా నిదానపల్లికి చెందిన మందడి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొన్ని రోజులుగా రాజుకున్న వివాదానికి.. ఇప్పటివరకు ఉన్న ఛైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామాతో తెరపడింది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాడని, గుడిపాటి రాజీనామా చేయాలని ఇటీవలె 11 మంది డైరెక్టర్లు ధర్నా చేశారు. ఈ పరిణామంలో ఆయన రాజీనామా లేఖను ఎండీకి అందజేశారు.

News January 9, 2026

మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

image

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్‌కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి