News February 27, 2025

పాకిస్థాన్ చెత్త రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో PAK చెత్త రికార్డు నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ICC టోర్నీకి ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాక్‌కు ICC టోర్నమెంట్‌ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. PAK టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News January 20, 2026

భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

image

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News January 20, 2026

దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

image

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.

News January 20, 2026

ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

image

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.