News March 22, 2024
KMM: ఓటర్ కార్డుల పంపిణీ షురూ..

ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ కార్డుల పంపిణీ ప్రక్రియను తపాలాశాఖ మొదలు పెట్టింది. ఐదు నియోజకవర్గాలలో మొత్తం 37 వేల కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం ప్రధాన తపాలా కార్యాలయానికి చేరిన కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా అందించే కసరత్తును పోస్టల్ శాఖ ప్రారంభించింది.
Similar News
News January 13, 2026
ఖమ్మం: ఎల్ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

ఖమ్మం శ్రీరాంనగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIGఫ్లాట్ల దరఖాస్తు గడువును జనవరి 20వరకు పొడిగించినట్లు చీఫ్ ఇంజనీర్ జివి రమణారెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించామని చెప్పారు. అల్పాదాయవర్గాల కోసం కేటాయించిన ఈఫ్లాట్లకు ఆసక్తి గల వారు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. జనవరి 23న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.
News January 13, 2026
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజున శంకుస్థాపన చేసి, నేడు నీళ్లిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
News January 13, 2026
ఖమ్మం: సంక్రాంతి సందడి.. కిరాణా షాపులు కిటకిట!

సంక్రాంతి పండుగ వేళ జిల్లావ్యాప్తంగా మార్కెట్లు జనసందోహంతో సందడిగా మారాయి. పిండి వంటల కోసం కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేసేవారితో కిరాణా షాపులు కిటకిటలాడుతున్నాయి. బియ్యం పిండి, నూనె, బెల్లం, నువ్వుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు భారీగా తరలిరావడంతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. పండుగ వెలుగులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.


