News February 27, 2025
ప.గో జిల్లాలో: TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు✷ జిల్లాలో 65 శాతం పోలింగ్ ✷ శోభాయ మానంగా సోమేశ్వరుని రథోత్సవం.✷ సోమేశ్వర స్వామి రథోత్సవంలో అపశృతి ✷ భీమవరంలో యువకుడి మృతి ✷ తణుకులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్✷ దేవాలో గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి ✷ రేలంగులో అడుగడుగున వ్యర్ధాలు ✷తణుకులో ప్రభుత్వ హామీలు అమలు చేయాలి.
Similar News
News February 28, 2025
ప.గో వ్యాప్తంగా 65.43% ఓటింగ్ నమోదు

ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సమయానికి 65.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని తెలిపారు.
News February 28, 2025
బలివే గ్రామం ఉత్సవాల్లో మరణ మృదంగం

ముసునూరు మండలం బలివేలో మహాశివరాత్రి ఉత్సవాల్లో మరణ మృదంగం మోగుతోంది. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లింగపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం మృతిచెందగా..మరుసటిరోజునే అక్కిరెడ్డిగూడేనికి చెందిన H. రాంబాబును గురువారం బలివే తమ్మిలేరు బలితీసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జల్లుల స్నానం చేయాలని సూచించారు.
News February 28, 2025
భీమవరం: పంచారామం అన్నదాన సత్రానికి రూ.కోటి విరాళం

భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం అన్నదాన సత్రం పిలీగ్రీం సెంటరుకు రూ. కోటి మంజూరైంది. ఈ ప్రత్యేక గ్రాంటును దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ కాపీని తీసుకొచ్చి భీమవరం MLA,PAC ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులుకి శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఛైర్మన్ DV బాలసుబ్రహ్మణ్యం గురువారం అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ CH రంగసాయి పాల్గొన్నారు.