News February 28, 2025
BREAKING: ఆర్సీబీ ఘోర పరాజయం

WPLలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్‌నర్ (58) ఫిఫ్టీతో రాణించారు. లిచిఫీల్డ్ (30) ఫర్వాలేదనిపించారు. రేణుకా సింగ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు.
Similar News
News February 28, 2025
కేదార్ మృతిపై వీడని మిస్టరీ!

TG: నిర్మాత కేదార్ మృతిపై మిస్టరీ వీడటంలేదు. దుబాయ్‌లోని ఫ్లాట్‌లో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కేదార్ మృతికి ముందు ఆయన ఫ్లాట్‌లోనే ఉన్న ఓ మాజీ MLAను విచారించి వదిలేసినట్లు సమాచారం. అనంతరం ఆయన HYD వచ్చేశారు. ఇటు కేదార్ మృతిపై రాజకీయ దుమారం రేగుతోంది. ఫ్రెండ్ చనిపోతే KTR ఎందుకు స్పందించడంలేదని రేవంత్ ప్రశ్నించగా ఆ మరణాన్ని BRSకు అంటగట్టడమేంటని కవిత కౌంటర్ ఇచ్చారు.
News February 28, 2025
నిరంతరాయంగా 100రోజుల విద్యుత్ ఉత్పత్తి

AP: కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డ్ సృష్టించింది. 800MW ఉత్పత్తి చేయగల 3వ యూనిట్‌లో అంతరాయం లేకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో ఎండీ చక్రధర్ బాబు ప్రకటించారు. 2024 నవంబర్ 18 నుంచి 1,596 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే, సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 24గంటల వ్యవధిలోనే 4.949MU విద్యుత్ ఉత్పత్తి అయిందని చెప్పారు.
News February 28, 2025
పోసానికి 14 రోజుల రిమాండ్

AP: నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. నిన్న 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపర్చారు. రా.9 గంటల నుంచి ఉ.5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.