News March 22, 2024

NLG: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

image

లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఈ మేరకు భువనగిరి స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఐతో కలిసి పోటీ చేయాలని భావించినా.. ఆ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే యోచనలో ఉండడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా సీపీఎంకు పడే ఓట్ల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్..

Similar News

News January 15, 2025

చైనా మాంజాతో గుట్టలో దంపతులకు గాయాలు

image

చైనా మాంజా దారం తగిలి బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాయాలైన ఘటన బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగింది. స్థానికుల వివరాలిలా.. దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు తెగింది. అతడి భార్య వాహనం పైనుంచి పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News January 15, 2025

భువనగిరి: గాలిపటం ఎగరవేస్తూ వ్యక్తి మృతి

image

పండగపూట ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం జరిగింది. జూపల్లి నరేందర్ పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని చెప్పారు.

News January 15, 2025

నేడు వేములపల్లికి ఎమ్మెల్యే

image

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమనగల్లు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో అభివృద్ధి పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.