News February 28, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు > పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో రథోత్సవం > సాగునీటి కోసం కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా > మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ > కాంగ్రెస్ వస్తే కష్టాలు కామన్ ఎర్రబెల్లి దయాకర్ రావు > జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు > జిల్లా వ్యాప్తంగా 94.39% పోలింగ్ నమోదు

Similar News

News February 28, 2025

కాజల్, తమన్నాను విచారించనున్న పోలీసులు

image

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్‌ను పోలీసులు విచారించనున్నారు.

News February 28, 2025

KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్‌ బృందాలను నియమించారు.

News February 28, 2025

భద్రాద్రి: ఇసుక రవాణా.. ప్రాణం బలితీసుకుంది!

image

అక్రమ ఇసుక రవాణా వల్ల ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోవడమే కాక, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గుంపెనగుడెంలో ఇసుక ట్రాక్టర్లు తోలుతుండగా, గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై ఇసుక ట్రాక్టర్ వెళ్లడంతో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కుంజంషన్ను అనే యువకుడు మరణించారని, శ్యామలచెన్ను అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.

error: Content is protected !!