News February 28, 2025
GWL: మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం: ఎస్పీ

మహిళల రక్షణ షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్- 2 జిల్లాలలో జనవరి నెలలో గద్వాల షీ టీమ్స్ బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జనవరిలో 14 ఫిర్యాదులు స్వీకరించి, 13 మందిని పట్టుకుని, 1FIR, 13 పెట్టి కేసులు నమోదు చేసిందని ప్రశంసించారు.
Similar News
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్ పదవికి నామినేషన్

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్‌గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్ చేసింది. ఇస్రో, బార్క్ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్ కేంద్రంలో ఇంజినీర్‌గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.
News July 6, 2025
సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.