News March 22, 2024

గుంటూరు: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామన్ వెరైటీ సగటు ధర రూ.500, స్పెషల్ వెరైటీ సగటు ధర రూ.1,000 మేరకు పెరిగింది. రైతులు గురువారం 1,06,381 బస్తాలు యార్డుకు తరలించారు. 1,04,332 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 81,360 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీలో 334, 273రకాల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. 

Similar News

News April 9, 2025

తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

image

ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్ధనరావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి ,పేరేచర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాశ్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా అరెస్టు చేసి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News April 9, 2025

గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా  హుబ్లీ-కతిహార్ మార్గంలో కొత్తగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. హుబ్లీ-కతిహార్(07325) ప్రత్యేక రైలు ఏప్రిల్ 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతీ బుధవారం హుబ్లీ నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా కతిహార్ చేరనుంది. ఇదే మార్గంలో కతిహార్-హుబ్లీ(07326) రైలు ఏప్రిల్ 12 నుంచి మే 3వ తేదీ వరకు ప్రతి శనివారం కతిహార్ నుంచి బయలుదేరుతుంది. 

News April 9, 2025

గుంటూరు: డెలివరీ బాయ్స్ వివరాలు నమోదు చేయండి

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 18-59 సంవత్సరాల వయస్సు గల డెలివరీ బాయ్స్ సహా అసంఘటిత రంగం కార్మికులు తమ వివరాలు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రారంభమైన ఈ ప్రత్యేక డ్రైవ్‌ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, కార్మికులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. 

error: Content is protected !!