News February 28, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

సంగారెడ్డి జిల్లాలో మార్చి 3 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

image

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 16, 2025

సిరిసిల్ల: బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

image

తెలంగాణ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు సిరిసిల్ల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గీస బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా ఎగమంటి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, సహాయ కార్యదర్శులుగా నరేందర్, రాజెల్లయ్య, భూమయ్య, వెంకటి, కోశాధికారిగా ప్రభాకర్ ను ఎన్నుకున్నామన్నారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News September 16, 2025

సిరిసిల్ల: ‘హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు’

image

హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించినట్టు సిరిసిల్ల SP మహేష్ బి గితే తెలిపారు. SP తెలిపిన వివరాలు.. వేములవాడలోని ఓ మామిడి తోటలో మరిపెళ్లి రాజయ్య(64), మంత్రి ఆనందం పనిచేస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్యలో గొడవలు రాగా ఆనందం ఏప్రిల్ 29, 2024లో రాజయ్యను పారతో తలపై బాది హత్య చేశాడు. నేరం రుజువు కాగా శిక్ష పడిందన్నారు.