News February 28, 2025
కడప జిల్లాను నాటుసారా రహితంగా మార్చాలి: కలెక్టర్

కడప జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని, ఆ దిశగా జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం నవోదయం 2.0పై జిల్లా SP అశోక్ కుమార్, DRO విశ్వేశ్వర నాయుడుతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.
Similar News
News February 28, 2025
బద్వేలులో గంజాయి స్వాధీనం

బద్వేలులో పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సీతారాంరెడ్డి తెలిపారు.
News February 28, 2025
వెలుగులోకి ఆదిమానవుని 12 శాసనాలు

లంకమల అభయారణ్యంలో లభ్యమైన 4 నుంచి 8వ శతాబ్దం కాలం నాటి ఆదిమానవుల 12 శాసనాలను భారతదేశ పురావస్తుశాఖ ఎపిగ్రఫీ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు బీటు కణతి గుండం, గోపాలస్వామి కొండ పరిసర ప్రాంతాలను గురువారం ఆదిమానవుల రేఖా చిత్రాలపై 6 మంది సభ్యుల బృందం పరిశోధన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ కళావతి పాల్గొన్నారు.
News February 27, 2025
బద్వేలు: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

బద్వేలుకు చెందిన ఆరు సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల వివరాల మేరకు.. బద్వేలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న మంజుల అనే బాలిక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.