News February 28, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు మహబూబాబాద్ జట్లు

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈనెల 28 నుంచి మార్చి 2వరకు జరిగే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ సబ్ జూనియర్ పోటీలకు జిల్లా బాలబాలికల జట్లు మహబూబాబాద్ నుంచి తరలివెళ్లాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల పంజాబ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో బాలబాలికలు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

Similar News

News July 4, 2025

నరసరావుపేట: మొహరం సందర్భంగా పటిష్ట బందోబస్తు

image

మొహరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. మొహరం వేడుకలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ సోదర భావంతో మెలగాలని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

News July 4, 2025

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం: జేసీ

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో రీ-సర్వే జరిగిన గ్రామాల్లో యడ్లపాడు, చిలకలూరిపేట, నకరికల్లు, నాదెండ్ల, నరసరావుపేట, నూజెండ్ల, పెదకూరపాడు, రొంపిచర్ల, శావల్యాపురం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు జేసీ సూరజ్ తెలిపారు. 9 మండలాలకు గాను 47,265 భూమి యాజ మాన్య హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News July 4, 2025

గంభీరావుపేట్: ‘త్వరగా పూర్తిచేసుకుని సాయం పొందాలి’

image

ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా పూర్తిచేసుకుని ప్రభుత్వం నుంచి సాయం పొందాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలం గోరింటాలలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలలో లబ్ధిదారులకు అధికారులు సహకరించాలని సూచించారు. డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహసిల్దార్ లు ఉన్నారు.