News February 28, 2025
‘కృష్ణా’లో రికార్డు స్థాయిలో పోలింగ్.. 69.92% మేర ఓట్లు పోల్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. గురువారం రాత్రి అధికారులు విడుదల చేసిన రిపోర్టు ప్రకారం జిల్లాలో 69.92% మేర ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 63,144 మంది ఓటర్లకు గాను 44,131 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 25,082 మంది, మహిళా ఓటర్లు 19,103 మంది ఉన్నారు.
Similar News
News July 9, 2025
కృష్ణా: ఉచిత బస్సుపై ఆ ప్రాంతాల ప్రజలకు నిరాశ.!

పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!
News July 9, 2025
కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS)లకు త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మొత్తం 66 పీఏసీఎస్‌లకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా ఒకరు, సభ్యులుగా ఇద్దరిని నియమించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల సీఈఓ, కార్యదర్శులు పని చేయనున్నారు. పీఎసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించే వరకు ఈ కమిటీలు పని చేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News July 8, 2025
నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.