News February 28, 2025
త్రివేణీ సంగమం వద్ద అగ్నిప్రమాదం

మహా కుంభమేళా జరిగిన ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. త్రివేణీ సంగమం వద్ద ఉన్న శాస్త్రి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మహా కుంభమేళా జరిగిన రోజుల్లోనూ పలుమార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. బుధవారంతో కుంభమేళా ముగిసింది.
Similar News
News February 28, 2025
ఎక్కువ పని గంటలు ప్రాణానికి ముప్పు!

కెరీర్‌లో మరింత రాణించాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అనుకునే వారికి డా. సుధీర్ కుమార్ పలు సూచనలు చేశారు. ‘కెరీర్ గ్రోత్ కోసం రోజుకు 15 గంటలు పని చేయొచ్చా అని ఓ 25 ఏళ్ల ఉద్యోగి అడిగితే ఇలా చేస్తే మీరు రాణించలేరని చెప్పా. తెలివిగా, ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయడం మంచిది. అతిగా పనిచేయడం వల్ల గుండెపోటు, పక్షవాతంతో పాటు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ఒత్తిడితో పాటు నిరాశకు గురవుతారు’ అని ఆయన ట్వీట్ చేశారు.
News February 28, 2025
పెళ్లి తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన శోభిత

టాలీవుడ్ హీరో నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మళ్లీ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. గతంలో తాను ఒప్పుకున్న ఓ సినిమా షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా నటించినట్లు టాక్. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా వీరి పెళ్లి తర్వాత చైతూ నటించిన ‘తండేల్’ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
News February 28, 2025
బీఆర్ఎస్ SLBCని ఎందుకు పూర్తిచేయలేదు: జూపల్లి

రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్ రావు SLBC ప్రమాదంపై కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లికృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో SLBC టన్నెల్‌ని 100మీటర్లు తవ్వి ఎందుకు వదిలేశారని సూటి ప్రశ్నవేశారు. ఎకరాకు రూ.లక్ష ఖర్చయ్యే టన్నెల్‌ను పూర్తి చేయకుండా రూ.3లక్షలయ్యే కాళేశ్వరం పనులు ఎందుకు చేపట్టారన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని BRS అక్కసు వెల్లగక్కుతోందన్నారు.