News February 28, 2025
ములుగు జిల్లావ్యాప్తంగా పోలైన ఓట్లు

ములుగు జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పోలైన ఓట్ల వివరాలు.. ములుగు మండలంలో 193 ఓట్లకు 180, వెంకటాపూర్ 40కి 35, గోవిందరావుపేటలోకి 108కి 102, తాడువాయి 65కి 58 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా ఏటూరునాగారంలో 46కి 44, కన్నాయిగూడెం 19కి 18, మంగపేట 95కి 88, వాజేడులో 33కి 31, వెంకటాపురం 29కి 27 ఓట్లు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు.
Similar News
News February 28, 2025
ఒంగోలు: రేపటి నుంచి కొత్త ఫైన్లు..!

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి భారీ ఫైన్లు తప్పవని ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు హెచ్చరించారు. ఫైన్ వివరాలను ఆయన వెల్లడించారు.
➤ హెల్మెట్(బైకుపై ఇద్దరికీ), ఇన్సూరెన్స్ లేకుంటే: రూ.1000
➤ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: రూ.10వేలు
➤ బైక్ రేసింగ్(ఓవర్ స్పీడ్): రూ.5 వేలు
➤ మైనర్ డ్రైవింగ్: రూ.1000
➤ డేంజరస్ పార్కింగ్: రూ.1500-రూ.3వేలు
➤ శబ్ద కాలుష్యం చేస్తే: రూ.2వేలు-రూ.4వేలు
News February 28, 2025
‘కూలీ’ రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది: సందీప్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు. ‘నేను కూలీ సినిమాలో భాగం కాదు. లోకేశ్ నా ఫ్రెండ్ కావడంతో సూపర్ స్టార్‌ను చూసేందుకు కూలీ సెట్స్‌కు వచ్చాను. నేను సినిమాలోని 45 నిమిషాలు చూశాను. ఇది కచ్చితంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
News February 28, 2025
హరీశ్ రావుపై మరో కేసు నమోదు

TG: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.