News February 28, 2025
జిల్లాలో రాయపర్తిలోనే తక్కువ పోలింగ్

రాయపర్తి మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వరంగల్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. రాయపర్తి మండలంలో 66మంది ఓటర్లుండగా.. 60 మంది టీచర్లు ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 90.90శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఎక్కువగా సంగెం మండలంలో 98.48శాతం నమోదైంది.
Similar News
News February 28, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57%

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.
News February 28, 2025
దుగ్గొండి: పులి అడుగులంటూ ప్రచారం..!

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రామయ్యపల్లి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికంగా కలకలం రేపింది. ఒక రైతు మొక్కజొన్న చేనులో పులి పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గురువారం ఆ అడుగులను పరిశీలించారు. అవి పులి అడుగులు కాదని హైనా జంతువు అడుగులని తెలిపారు.
News February 28, 2025
వరంగల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సీఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. బాలాజీనగర్కి చెందిన జక్కోజు శివకృష్ణచారి(31)కూలీ పని చేస్తుండేవాడు. తరచు మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. నిన్న సాయంత్రం మద్యం తాగి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. భార్య లావణ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు.