News February 28, 2025

CT: మరో సంచలనమా?.. దాసోహమా?

image

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?

Similar News

News February 28, 2025

మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు

image

AP: రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనిపై వారికి అవగాహన పెంచాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పనితీరు బాగుండాలి. మళ్లీ సభకు రావాలనే భావనతో పని చేయాలి. విభేదాలు, గ్రూపులను సహించను. ఎంపీలతో కలిసి సమన్వయం చేసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News February 28, 2025

ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ రివ్యూ

image

ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రల్లో అరివళగన్(వైశాలి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. ఓ కాలేజీలో వరుస ఆత్మహత్యల కేసును హీరో ఛేదించే క్రమంలో ఎదురయ్యే పరిణామాలేంటనేదే ఈ సినిమా స్టోరీ. సిమ్రాన్, లైలా పాత్రలు ఆశ్చర్యపరుస్తాయి. ఆది నటన, తమన్ BGM, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లస్. సెకండాఫ్ గజిబిజిగా ఉండటం, వీక్ క్లైమాక్స్, VFX మైనస్.
RATING: 2.5/5

News February 28, 2025

సమ్మర్‌లో ఇంటిని కూల్‌గా ఉంచే చిట్కాలు

image

వాక్యుమ్‌‌ క్లీనర్‌ను సాయంత్రం పూటే వాడండి. కిటికీలను కాటన్‌ కర్టన్‌లతో కప్పివేయండి. ఇంటిపై కప్పుపై నీటిని చల్లండి. గదిని శుభ్రంగా ఉంచుకోండి. లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువగా వాడండి. లైట్‌కలర్ పేయింట్స్ వల్ల వేడి కొంచెం తగ్గుతుంది. వీటితో పాటు అందరూ కాటన్‌దుస్తులు ధరించాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి లోపల, బయట వీలైనంత వరకు మొక్కలను పెంచాలి.

error: Content is protected !!