News February 28, 2025
చిట్యాల: కుటుంబ సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి మృతి

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సతీశ్ ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోందిజ ఈ క్రమంలో మద్యం తాగి ఉరేసుకొని చనిపోయాడు. భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరేసుకొని చనిపోయాడని మృతుడి తండ్రి కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News February 28, 2025
విశాఖ-గుణుపూర్ పాసెంజర్కు అదనపు బోగి

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ – గుణుపూర్ (58505/06) పాసెంజర్కు అదనపు బోగి వేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అదనపు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బోగి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
News February 28, 2025
జూరాల ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై గ్రౌటింగ్ హోల్స్లు బోరుబావిని తలపిస్తున్నాయి. డ్యామ్ లీకేజీలను అరికట్టేందుకు సిమెంట్ గ్రౌటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హోల్స్ బోరు బావిని తలపించేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును చూసేందుకు ప్రయాణికులు, సందర్శకులు వస్తుంటారు. గద్వాల్-ఆత్మకూరుకు ఇదే ప్రధాన రహదారి. ఈ ప్రమాదాలు జగరక ముందే పీజేపీ అధికారులు మూతలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
News February 28, 2025
మంత్రులకు చేపకూర, విద్యార్థులకు పస్తులా?: కేటీఆర్

TG: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. SLBC ప్రమాదంతో ఓ వైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు. అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులలోని ఎస్టీ బాలురు హాస్టల్ విద్యార్థులను శివరాత్రి రోజున గుడిలో అన్నదానానికి వెళ్లి తినమనడం దారుణమన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.