News February 28, 2025
ఎడపల్లి: గేదెలను కడగడానికి వెళ్లి వ్యక్తి మృతి

ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
Similar News
News October 30, 2025
రంగు మారిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలి: ఎమ్మెల్యేలు

అకాల వర్షాలకు రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తడిసిన వరి ధాన్యాన్ని తేమ చూడకుండా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
News October 30, 2025
NZB: నీలకంఠేశ్వరుడి సేవలో కలెక్టర్ దంపతులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కలెక్టర్ వినయ్‌కృష్ణా రెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి ఉన్నారు.
News October 30, 2025
NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. గేట్లు ఎత్తివేత..!

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R.బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.


