News February 28, 2025
హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటి?: కనిమొళి

తమిళులపై కేంద్రం హిందీ భాషను రుద్దడంపై DMK MP కనిమొళి తీవ్రంగా మండిపడ్డారు. అసలు హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఆ భాష వల్ల ఏం సాధిస్తామన్నారు. తాను ఎన్నడూ హిందీ నేర్చుకోలేదని, స్కూలుకెళ్లే తన కుమారుడూ ఆ భాషను నేర్చుకోవడం లేదన్నారు. TNలోని ప్రతీ విద్యార్థికి హిందీ రావాలని లేదని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయనందుకు కేంద్రం రూ.5000Cr ఫండ్స్‌ను నిలిపివేసిందని ఆరోపించారు.
Similar News
News February 28, 2025
సమ్మర్‌లో ఇంటిని కూల్‌గా ఉంచే చిట్కాలు

వాక్యుమ్ క్లీనర్‌ను సాయంత్రం పూటే వాడండి. కిటికీలను కాటన్ కర్టన్‌లతో కప్పివేయండి. ఇంటిపై కప్పుపై నీటిని చల్లండి. గదిని శుభ్రంగా ఉంచుకోండి. లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువగా వాడండి. లైట్‌కలర్ పేయింట్స్ వల్ల వేడి కొంచెం తగ్గుతుంది. వీటితో పాటు అందరూ కాటన్‌దుస్తులు ధరించాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి లోపల, బయట వీలైనంత వరకు మొక్కలను పెంచాలి.
News February 28, 2025
పోసాని బెయిల్ పిటిషన్.. సోమవారం విచారణ

APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరఫు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్‌కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.
News February 28, 2025
ఫేక్ జాబ్ నోటిఫికేషన్‌తో స్కామర్ల కొత్త మోసం..!

ఉద్యోగ వేటలో ఉన్న వారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ‘జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి ‘Grass Call’ అనే వీడియో కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. దీనిద్వారా సదరు వ్యక్తి ఫోన్, కంప్యూటర్‌లోని డేటా, బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారాన్ని తస్కరిస్తున్నారు’ అని వారు తెలిపారు.